- Vijayawada
- +91 9492716249
- Support@mudhra.co
కొత్తగా Tailoring మెషిన్ ని తీసుకోవాలి అనుకుంటే అసలు ఎలా Select చేసుకోవాలి. ఏ మెషిన్ ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
టైలరింగ్ మెషిన్ ని తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఏ Purpose కి వాడుకోవాలి అనుకుంటున్నారో చూసి Select చేసుకోండి.
మనం మూడు విధాలుగా మెషిన్ ని ఎంచుకోవచ్చు.
కేవలం ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే ఐతే Electric Sewing Machine Prefer చెయ్యటం మంచిది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరూ Normal Stitches , Zigzag , Pico ఇలా అన్ని ఒకే దానిలో వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం Normal Table Machine తో ఐతే అన్ని ఒకే దానిలో రావు కదా. మనకి ఉన్న ఏకైక Option Electric Sewing Machine మాత్రమే. అలానే మనకి Space కూడా Save అవుతుంది కదా. Portable కనుక ఎక్కడ కావాలి అంటే అక్కడ పెట్టుకొని Stitch చేసుకోవచ్చు, పని పూర్తి ఐనా తరువాత పక్కన పెట్టెయ్యవచ్చు. ఇవి చాలా Smart గా Weightless గా ఉంటాయి.
ఇవి వచ్చేసి మనకి 9000 వేలు నుండి 12000 వేలు మధ్య ఉంటాయి. అంటే ఇంకా చాలా cost లో కూడా ఉంటాయి అనుకోండి. ఇంట్లో వాడుకోవడానికి ఐతే ఈ Range లో సరిపోతుంది. మరీ ఎక్కువ రేట్ పెట్టనవసరం లేదు.
ఇప్పుడు Electric Sewing Machines ఏ మోడల్ ఎంత Cost ఉంటుంది దేనికి ఎన్ని Stitch Functions ఉంటాయి అనేది చూద్దాం.

| Other Features | 9 Built-in stitches (Number of stitches attribute), Automatic 4-step buttonhole, Adjustable stitch length, Automatic reverse to reinforce stitches, Snap-on presser feet – quick release for easy on and off, Heavy duty metal frame for skip-free sewing, On board accessory storage, Free arm for sewing difficult-to-reach areas, Extra-high presser foot lifter for bulky fabric, Two needle positions for precise top stitching |
ఇప్పుడు పైన చూపించిన వాటిలో ఏది తీసుకున్న పర్లేదు ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది అదేకాక కొత్త వారికి ఐనా కూడా Easy గానే ఉంటుంది Handle చెయ్యటానికి. ఇవి కేవలం ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే.
వీటిలోనే ఇంత Cost పెడుతున్నాం కదా తీసుకునేది ఇంకా కొని Stitch Functions వచ్చేలా తీసుకుందాము అనుకుంటే 13000 నుండి 17500 లోపు కొన్ని Electric Sewing Machines ఉన్నాయ్ అవి ఐతే మనకి Normal Stitches , Zigzag Stitches , Pico , Button Hole , Darning , Smocking , Zipper , Embroidery ఇలా చాలా options వస్తాయి. Machine మీద చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాంటివి కూడా చేసుకునే విధంగా ఉంటాయి.
అలానే ఈ Machines తో 8 Hours వరకు continuation గా Stitching చేసుకోవచ్చు. బయటి వారివి కూడా కుట్టటానికి అవకాశం ఉంటుంది. Machines వాడుకోవడానికి చాలా Convenient గా ఉంటాయి.
నేను ఈ మెషిన్ ని Recommend చేస్తాను తీసుకోవాలి అనుకునే వారికి. చాలా బాగుంటుంది Usha Electric Machines లో Best One.
ఈ Machine నా దగ్గర ఉంది, ఇప్పుడు నేను వాడుతున్నాను బాగుంది చాలా Smooth గా ఉంది వర్కింగ్.
ఈ మెషిన్ బయట Shops లో ఐతే Cost తక్కువ ఉంది ఆన్లైన్ లో ఎక్కువ ఉంది చూసి తీసుకోండి
Electric Machines కి Extension Table , Foots అవసరం ఐతే అవి కూడా కొనుక్కోవచ్చు Online లో Available గా ఉంటాయి.
సాధారణంగా First మనకి Stitching వచ్చేవరకు మన ఇంట్లో కి వరకు కుట్టుకోగలిగితే చాలు అని అనుకుంటాం కానీ మనకి Stitching బాగా వచ్చిన తరువాత మనవరకు మాత్రమే కాకుండా బయటి వారివి కూడా Stitch చేస్తే కొంచం మనకి ఒక ఆదాయం ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది.
లేదా మనం బాగా నేర్చుకొని ఇంటి దగ్గర వరకు Stitch చేద్దాం అన్న ఆలోచనతో కూడా కొందరు ఉంటారు. అలాంటి వారు Electric Sewing Machine తో వ్యాపారానికి వాడుకోవటం కొంచం కష్టం ఎందుకంటే ఇంట్లో వరకు ఐతే ఎప్పుడో ఒకటి అర మాత్రమే Stitch చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా వ్యాపారానికి అంటే Normal Sewing Machine తీసుకోవటం బెస్ట్ అదే అండీ Table Machine
Normal Sewing Machine లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయ్ అండీ.
1) చిన్న మెషిన్
2) పెద్ద మెషిన్

Normal Table Machine ఐతే మనం Rough & Tough గా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు నార్మల్ గా కాలితో తొక్కుతూ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మోటార్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అంటే అలా Use చేసుకోవచ్చు. ఇందులో మనకి కేవలం Straight Stitches మాత్రమే వస్తాయి. Pico , Zigzag ఇలాంటివి ఏమి రావు.
ఈ నార్మల్ టేబుల్ మెషిన్ లో ఐతే చాలా కంపెనీస్ ( Usha, Merritt, Singer, Ralson, Vidhya, Mona, Bharat, Sheela) ఉన్నాయ్ ఇదే కంపెనీ బాగుంటుంది మిగిలినవి బాగోవు అని ఏమి లేదు ఏది ఐనా పర్లేదు. కంపెనీని బట్టి ఒక 500 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. Motor తో కలిపే cost చెప్తారు. దాదాపుగా 5500 రూపాయలు నుండి 6500 వరకు Cost ఉంటుంది. ఈ Machine ఇంట్లో కి వాడుకోవచ్చు అలానే బయట వారికి కూడా కుట్టటానికి Comfortable గా ఉంటుంది.

ఇప్పుడు మనం పైన చిన్న మెషిన్ చూసాం కదా అలానే పెద్ద మెషిన్ ఉంటాయి అంటే ఈ మెషిన్ కి వచ్చేసి కొంచం పెద్ద Head వస్తుంది , అలానే టేబుల్ కూడా కొంచం పొడవు ఉంటుంది. చిన్న మెషిన్ కి పెద్ద మెషిన్ కి తేడా ఏంటి అంటే కుట్టు Finishing బాగుంటుంది, Work Speed గా చేసుకోవచ్చు. Stitching కి Comfortable గా ఉంటుంది అదే తేడా ఇంతకు మించి ఏం ఉండదు పెద్ద మెషిన్ ఐనా కూడా కేవలం Straight Stitches మాత్రమే వస్తాయి.
చిన్న మెషిన్ లో ఏ కంపెనీస్ ఉంటాయో దీనిలో కూడా అవే కంపెనీస్ ఉంటాయి. Cost కొంచం ఎక్కువ ఉంటుంది 8700 నుండి 10000 వేలు వరకు ఉంటాయి కంపెనీ ని బట్టి ఒక 500 , 1000 అటు ఇటు గా ఉంటాయి. మోటార్ తో కలిపే Cost ఉంటుంది.
Industrial Purpose అంటే ఎక్కువ గా Piece Work చేసే వారికి , Nighties Stitching కి రెడీమేడ్ వాటికి ఇలాంటి Machines ఎక్కువ వాడుతారు. మనకి ఈ Machines వర్క్ Speed గా అవ్వటం కోసం Prefer చేస్తాను. ఇవి మూమూలుగా కొట్టుకునే వారికి ఐతే అవసరం ఉండదు. ఎక్కువ వర్క్ Continues గా Stitching చేసే వారికి ఐతే బాగా పనికొస్తాయి. వీటిలో Juki , Jack F5 , Usha Machines ఎక్కువ Use చేస్తారు.
చూసారు కదా మీకు ఎలా కావాలో చూసి Sewing Machines ని Select చేసుకోండి.
Zigzag Table Machine తో Zigzag , Pico , అలానే Straight Stitches కూడా వస్తాయి. ఒకే అలాంటి అప్పుడు ఈ మెషిన్ ని తీసుకుంటే సరిపోతుంది కదా Electric machines కాకండా అని కూడా అనుకోవచ్చు కానీ Zigzag మెషిన్ ఎప్పుడు కూడా zigzag , Falls Stitch చేసుకోవటానికి మాత్రమే బాగుంటుంది. Straight Stitches వస్తున్నాయి కదా అని Use చేస్తే వెంట వెంటనే Repairs వస్తాయి. అదేకాక ఈ మెషిన్ తో Normal Stitches కి తొక్కాలి అంటే చాలా గట్టిగా ఉంటుంది. నేర్చుకోవాలి అనే Interest పోతుంది. దీనిని కొత్తగా నేర్చుకునే వారు Prefer చెయ్యవద్దు Normal Straight Stitches కోసం ఐతే. దీని Cost 7000 వేలు నుండి 8000 వేలు వరకు ఉంటుంది. ఇవి కూడా కంపెనీస్ బట్టి Cost కొంచం మారుతుంది. జిగిజాగ్ కి Renew Machine బాగుంటుంది

ఈ మెషిన్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీ దగ్గర నార్మల్ మెషిన్ , టేబుల్ ఉండి, నార్మల్ టేబుల్ మెషిన్ ని నేను మార్చే బదులు ఎలా ఐనా మన దగ్గర నార్మల్ మెషిన్ టేబుల్ ఉంది కదా Zigzag Machine Head కొనుక్కొని ఈ టేబుల్ కి పెట్టి Use చేసుకుంటాను అనుకునే వారు తీసుకోవచ్చు. అలానే బయట వారికి జిగిజాగ్, ఫాల్స్ Stitching చెయ్యాలి అంటే తీసుకోవచ్చు.
OVERLOCK MACHINE
ప్రస్తుతం ప్రతి ఒక్కరు బ్లౌసెస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, ఇలా ఏ స్టిచ్ చేసుకున్న లోపల వైపున కచ్చులు నీట్ గా ఉండాలి అలానే గుచ్చుకోకుండా ఉండాలి అని కూడా అనుకుంటున్నాం కనుక Overlock అనేది ఇప్పుడు వాడకం పెరిగి పోయింది.
Already మీ దగ్గర Electric Machine ఉంటె దానిలో overlock స్టిచ్ కూడా వస్తుంది. అలా కాకుండా టేబుల్ మెషిన్ ఉన్న వారు అయితే పైన ఫోటో లో ఉన్న లాంటిది సెపెరేట్ గా తీసుకోవచ్చు. బయట stitching కూడా చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది.
దాదాపుగా Complete Details మీకు ఇచ్చాను. ఈ Article మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అలానే ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారు కూడా తెలుసుకుంటారు. Have A Nice Day.